KL Rahul: భార్యతో కలిసి మహాబలేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేఎల్ రాహుల్

KL Rahul and Athiya performs prayers at Mahabaleshwar temple
  • గత నెలలో ఓ ఇంటివాడైన కేఎల్ రాహుల్ 
  • బాలీవుడ్ నటి అతియాశెట్టితో వివాహం
  • జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించిన రాహుల్ దంపతులు
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిల వివాహం గత నెల 23న వైభవంగా జరగడం తెలిసిందే. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో పాల్గొంటున్న కేఎల్ రాహుల్ తొలి రెండు టెస్టుల అనంతరం విరామం లభించడంతో భార్యతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నాడు. 

తాజాగా మహారాష్ట్రలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహాబలేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని కేఎల్ రాహుల్, అతియా శెట్టి సందర్శించారు. ఆలయంలోని శివలింగానికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్, అతియా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. అర్చకులు కేఎల్ రాహుల్ దంపతులకు తీర్థప్రసాదాలు అందించారు.
KL Rahul
Athiya Shetty
Mahabaleshwar
Team India
Bollywood

More Telugu News