Rhino: ఖడ్గమృగం నుంచి తప్పించుకునే యత్నంలో వాహనం బోల్తా... వీడియో ఇదిగో!

  • పశ్చిమ బెంగాల్ లో ఘటన
  • అలీపూర్ జిల్లాలోని జలదాపర పార్క్ సందర్శనకు వెళ్లిన పర్యాటకులు
  • ఖడ్గమృగాన్ని ఫొటో తీసే ప్రయత్నం
  • వాహనంపైకి దూసుకొచ్చిన ఖడ్గమృగం
  • ఐదుగురు పర్యాటకులకు గాయాలు
Rhino attacks on vehicle as visitors injured

వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో జంతువులను చూసేందుకు వెళ్లినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వాటికి దగ్గరగా వెళ్లడం, సమీపం నుంచి ఫొటోలు తీసే ప్రయత్నం చేయడం ప్రమాదకరం. ఆ విధంగా ఫొటోలు తీయబోయి పశ్చిమ బెంగాల్ లో కొందరు పర్యాటకులు గాయాలపాలయ్యారు. 

వివరాల్లోకెళితే... అలీపూర్ జిల్లాలో జలదాపరా నేషనల్ పార్క్ ఉంది. కొందరు పర్యాటకులు వాహనాల్లో వెళ్లి జంతువులను ఫొటో తీసే ప్రయత్నం చేశారు. ఇంతలో ఒక ఖడ్గమృగం పొదల్లోంచి బయటికి వచ్చి వాహనం దిశగా పరుగులు తీసింది.

దాంతో భయపడిపోయిన వాహనం డ్రైవర్ రివర్స్ లో పోనిచ్చే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. వాహనం రోడ్డు పక్కకి జారిపోయి బోల్తా కొట్టగా, ఐదుగురు పర్యాటకులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News