Akshay kumar: ప్రతి ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టలేరు.. సినిమా ఫ్లాప్ లపై అక్షయ్ కుమార్!

Akshay kumar says his films flopping at box office as it is his fault
  • కలెక్షన్లలో వెనకబడ్డ ‘సెల్ఫీ’ సినిమా
  • గతంలో అక్షయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్
  • సినిమా హిట్ అవ్వడం లేదంటే అది తన తప్పేనని వ్యాఖ్య
  • ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చిందని వెల్లడి
‘సెల్ఫీ’ సినిమాతో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. వరుస ఫ్లాప్ లు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అక్షయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఫలితం మాత్రం మారలేదు. కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. దీంతో గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అక్షయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటీవల సెల్ఫీ సినిమా ప్రమోషన్స్ సమయంలో మాట్లాడిన అక్షయ్.. తన సినిమాలు ఫ్లాప్ కావడం గురించి ప్రస్తావించాడు. 

గతంలో తాను నటించిన 16 సినిమాలు వరుసగా నిరాశపరిచాయని అక్షయ్ చెప్పాడు. మరోసారి 8 సినిమాలు ఆశించినంతగా ఆడలేదని తెలిపాడు. సినిమా హిట్ అవ్వడం లేదంటే అది తన తప్పేనని, ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చిందని, వాళ్లు కొత్త దనాన్ని కోరుకుంటున్నారని వివరించాడు. ‘‘సినిమాను ప్రేక్షకులు ఆదరించడం లేదంటే వాళ్లు నా నుంచి కొత్తదనంతో కూడిన కథలను ఆశిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం దాని కోసమే ప్రయత్నిస్తున్నా’’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. 

సినీ పరిశ్రమలోనే కాదు.. అందరికీ ఇది వర్తిస్తుందని అక్షయ్ అన్నాడు. వ్యాపారంలో ఎప్పుడూ లాభాలే రాకపోవచ్చని చెప్పాడు. ఓ క్రికెటర్ ప్రతి ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టలేడని అన్నాడు. తాను చెప్పేది ఒక్కటేనని, సినిమా హిట్ అవ్వకపోతే.. ప్రేక్షకులను నిందించొద్దని, అది 100 శాతం తన తప్పేనని చెప్పాడు. అక్షయ్, ఇమ్రాన్ హష్మీ కలిసి నటించిన చిత్రం సెల్ఫీ. ఇది మలయాళ హిట్ సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’కు రీమేక్. సినీ హీరో, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కి మధ్య జరిగే కథే ఈ సినిమా.
Akshay kumar
Selfie
Bollywood
imraan hashmi

More Telugu News