Snake: ఇంద్రకీలాద్రి క్యూలైన్లో పాము కలకలం... పరుగులు తీసిన భక్తులు

Snake spotted in Vijayawada Kanakadurga Temple que line
  • క్యూలైన్లో ప్రవేశించిన పొడవైన పాము
  • హడలిపోయిన భక్తులు
  • ఓ కర్రతో పామును కిటికీలోంచి బయటికి పంపించిన అధికారులు
విజయవాడ ఇంద్రీకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పాము ప్రవేశించింది. క్యూలైన్లో పొడవైన పాము కనిపించడంతో భక్తులు పరుగులు తీశారు. భక్తుల అరుపులతో గందరగోళం ఏర్పడింది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు క్యూలైన్ ను ఖాళీ చేయించి, ఆ పామును ఓ కర్ర సాయంతో కిటీకీ ద్వారా బయటికి పంపించి వేశారు. 

కాగా, పాము ఆ కిటీకీలోంచే క్యూలైన్లో ప్రవేశించిందని భక్తులు వెల్లడించారు. పామును వెంటనే బయటికి పంపించివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంద్రకీలాద్రిపై గతంలోనూ పాములు కనిపించిన సంఘటనలు జరిగాయి.
Snake
Que Line
Kanakadurga Temple
Vijayawada

More Telugu News