Kasani Jnaneswar: టీడీపీ తల్లి పార్టీ అన్న రేవంత్... పార్టీలోకి రావొచ్చన్న కాసాని జ్ఞానేశ్వర్

Kasani Jnaneswar welcomes Revanth Reddy into TDP
  • టీడీపీలోకి రేవంత్ ను ఆహ్వానిస్తున్నామన్న కాసాని
  • వచ్చే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇస్తామని వెల్లడి
  • పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం ఉంటుందని స్పష్టీకరణ
వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడిన సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీడీపీని తల్లి పార్టీ అని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. టీడీపీలోకి రేవంత్ ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తల్లి పార్టీపై ప్రేమ ఉందన్న రేవంత్ కు టీడీపీ స్వాగతం పలుకుతోందని అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇస్తామని కాసాని చెప్పారు. పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ టీడీపీకి సంబంధించి పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీ నియామకం ఉంటుందని వెల్లడించారు. 

కాగా, ఓ ఇంటర్వ్యూలో రేవంత్ మాట్లాడుతూ, టీడీపీతో పొత్తు ఉంటుందా అన్న అంశంపై స్పందించారు. పొత్తు అంశం పార్టీ అధిష్ఠానం పరిధిలోని విషయమని స్పష్టం చేశారు. తాము రాష్ట్ర నాయకత్వం తరఫున సూచనలు, సలహాలు మాత్రమే ఇస్తామని వెల్లడించారు. అయితే అధిష్ఠానం ఆ సూచనలు, సలహాలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు... పొత్తులపై అంతిమనిర్ణయం వారిదేనని వివరించారు.
Kasani Jnaneswar
Revanth Reddy
TDP
Congress
Alliance
Telangana

More Telugu News