Rajamouli: 11 ఏళ్ల బాలిక చేతుల మీదుగా అవార్డు అందుకున్న రాజమౌళి... ఆ బాలిక ఎవరంటే...!

Rajamouli takes award from child actress Violet Mcgraw for RRR
  • హాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ హంగామా
  • ఆర్ఆర్ఆర్ కు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు
  • బాలనటి వయొలెట్ మెక్ గ్రా చేతుల మీదుగా రాజమౌళికి అవార్డు
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం హాలీవుడ్ లో అవార్డులు కొల్లగొడుతోంది. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ దిగ్గజాల సినిమాలను సైతం వెనక్కి నెట్టి నాలుగు అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. 

కాగా, దర్శకుడు రాజమౌళి అవార్డును అందుకున్న అనంతరం సోషల్ మీడియాలో స్పందించారు. అద్భుత ప్రతిభావంతురాలైన 11 ఏళ్ల బాలనటి వయొలెట్ మెక్ గ్రా చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషం కలిగించిందని తెలిపారు. అవార్డు అందించిన అనంతరం ఆ అమ్మాయి తనను సెల్ఫీ అడగడం మరింత ఆనందం కలిగించిందని రాజమౌళి ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. అంతేకాదు, ఆ హాలీవుడ్ బాలనటితో సెల్ఫీని కూడా పంచుకున్నారు. 

వయొలెట్ మెక్ గ్రా హాలీవుడ్ లో బాలనటిగా అనేక చిత్రాల్లో నటించింది. ఐదేళ్ల వయసు నుంచే నటిస్తున్న వయొలెట్ రెడీ ప్లేయర్ వన్ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బెన్నెట్స్ వార్, అవర్ ఫ్రెండ్, బ్లాక్ విడో, డాక్టర్ స్లీప్, సెపరేషన్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. పలు టీవీ సిరీస్ లతోనూ వయొలెట్ ప్రేక్షకులకు దగ్గరైంది.
Rajamouli
Violet Mcgraw
Award
RRR
Hollywood Critics Awards

More Telugu News