లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న యనమల రామకృష్ణుడు

  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
  • నేడు తిరుపతి విచ్చేసిన యనమల
  • తిరుపతిలో పాదయాత్ర కొనసాగింపు
Yanamala Ramakrishnudu  participates in Lokesh Yuvagalam Padayatra

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తిరుపతిలో కొనసాగుతోంది. నేటి పాదయాత్రలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు. అంకుర హాస్పిటల్ సమీపంలోని విడిది నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా, యనమల కూడా లోకేశ్ తో కలిసి అడుగులు వేశారు. 

నేటి పాదయాత్రలో భాగంగా లోకేశ్ భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో ఇసుక దోపిడీ ద్వారా జగన్ కు రోజుకు రూ.3 కోట్ల వరకు ముడుతున్నట్టు ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఆ లెక్కన ఏడాదికి రూ.1,095 కోట్లు, ఐదేళ్లకు రూ.5,475 కోట్లు అని వివరించారు. ఈ డబ్బు కోసం లక్షలాది భవన నిర్మాణ కార్మికులను జగన్ పస్తులు పెడుతున్నాడని విమర్శించారు.

More Telugu News