YS Sharmila: తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: షర్మిల

  • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
  • కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది
  • ఎన్నికలు సజావుగా సాగుతాయనే నమ్మకం కూడా లేదు
YS Sharmila demands President Rule in Telangana

తెలంగాణను కేసీఆర్ ఒక నియంత మాదిరి పాలిస్తున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ లో ఉన్నదంతా గూండాలేనని, ప్రతిపక్షాలపై వారు దాడులు చేస్తున్నారని చెప్పారు. దేశంలో భారత రాజ్యాంగం అమల్లో ఉంటే, తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసైని షర్మిల కలిశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కోరానని చెప్పారు. 

వీధికుక్కలు దాడి చేసి పసిపిల్లల ప్రాణాలు తీసినా పట్టించుకునేవాళ్లే లేరని షర్మిల అన్నారు. అన్ని వ్యవస్థలను కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకున్నారని, ఎన్నికలు సజావుగా సాగుతాయనే నమ్మకం కూడా తనకు లేదని చెప్పారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదని చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.

More Telugu News