Ramcharan: టామ్ క్రూస్, బ్రాడ్ పిట్ లతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పోటీ.. అద్భుతమైన ఫీలింగ్ అన్న చరణ్!

Ram Charan and Junior NTR in competition with Brad Pitt and Tom Cruise
  • అంతర్జాతీయ వేదికలపై 'ఆర్ఆర్ఆర్' సందడి
  • క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్ బరిలో నిలిచిన రాజమౌళి చిత్రం
  • బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ పోటీలో చరణ్, తారక్
'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ సినీ వేదికలపై భారత సినీ పరిశ్రమ తలెత్తుకునేలా చేస్తోంది. ఈ సినిమా ఖ్యాతి మన దేశ ఎల్లలు దాటి అన్ని ఖండాలకు పాకింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులను కైవసం చేసుకుంది. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల్లో ఏకంగా ఐదు కేటగిరీల్లో ట్రోఫీలను సాధించింది. ఇప్పు మరో ఘనత సాధించేందుకు ముందుకు సాగుతోంది. క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ అవార్డుకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నామినేట్ అయ్యారు. వీరిద్దరూ హాలీవుడ్ సూపర్ స్టార్స్ నికోలస్ కేజ్, టామ్ క్రూస్, బ్రాడ్ పిట్ లతో పోటీ పడుతున్నారు. విజేత ఎవరనేది మార్చి 16న ప్రకటిస్తారు. 

మరోవైపు సూపర్ అవార్డ్స్ కు నామినేట్ కావడంపై రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశాడు. తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తన పేరు కూడా యాక్షన్ మూవీలో బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం నామినేట్ కావడం సంతోషాన్ని కలిస్తోందని చెప్పాడు. నికోలస్ కేజ్, టామ్ క్రూస్, బ్రాడ్ పిట్ వంటి లెజెండ్స్ పక్కన తమ పేర్లు ఉండటం ఒక అద్భుతమైన ఫీలింగ్ ను కలగజేస్తోందని అన్నాడు. 
Ramcharan
Junior NTR
RRR
Critics Choice Super Awards

More Telugu News