మరోసారి సుకుమార్ తో కలిసి రంగంలోకి దిగనున్న చరణ్!

  • సుకుమార్ తో 'రంగస్థలం' చేసిన చరణ్ 
  • బుచ్చిబాబుతో సినిమా తరువాత లైన్ లోకి సుకుమార్
  • ఈ లోగా 'పుష్ప 2' పూర్తి చేయనున్న సుక్కూ
  • పాన్ ఇండియా స్థాయిలోనే చరణ్ ప్రాజెక్టు  
  • తెరపైకి కీర్తి సురేశ్ - ఆషిక రంగనాథ్ పేర్లు

Ram Charan in Sukumar Movie

సుకుమార్ - చరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'రంగస్థలం' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా చరణ్ కెరియర్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి నుంచి ఈ కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ కాంబో సెట్ కానుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ముగింపు దశకి చేరుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ చేయనున్నాడని అంటున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. 

ఇక నెక్స్ట్ ప్రాజెక్టును మాత్రం సుకుమార్ తోనే చేయనున్నాడని అంటున్నారు. ఇది కూడా పాన్ ఇండియా స్థాయి సినిమా కావడం విశేషం. చరణ్ తరువాత బన్నీతో 'పుష్ప' చేయడం .. బన్నీ తరువాత మళ్లీ చరణ్ తో సుకుమార్ ప్లాన్ చేయడం విశేషం. ఈ సినిమాలో కథానాయికలుగా కీర్తి సురేశ్ .. ఆషిక రంగనాథ్ పేర్లు తెరపైకి వచ్చాయి.

More Telugu News