Ramcharan: రాజమౌళి పిలిస్తేనే స్టేజ్ పైకి వచ్చా: హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల్లో రామ్ చరణ్

Ramcharan speech in HCA awards
  • హెచ్సీఏ అవార్డులను కొల్లగొట్టిన 'ఆర్ఆర్ఆర్'
  • స్పాట్ లైట్ అవార్డును అందుకున్న చరణ్
  • స్టేజ్ మీదకు వస్తానని ఊహించలేదన్న చరణ్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదు అవార్డులను కొల్లగొట్టింది. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, హెచ్సీఏ స్పాట్ లైట్ (విదేశాల్లో సైతం విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం) అవార్డులను సొంతం చేసుకుంది. 

మరోవైపు స్పాట్ లైట్ అవార్డును రామ్ చరణ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా వేదికపై నుంచి చరణ్ మాట్లాడుతూ, 'హాయ్ గయ్స్, నేను స్టేజ్ మీదకు వస్తానని ఊహించలేదు. నా డైరెక్టర్ తోడుగా రమ్మని పిలిస్తేనే స్టేజ్ పైకి వచ్చాను. అవార్డు అందుకోవడాన్ని ఎంతో గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నా. మరిన్ని మంచి చిత్రాలతో అందరినీ అలరించేందుకు కృషి చేస్తాం. థాంక్యూ' అని చెప్పారు. 
Ramcharan
HCA awards
Tollywood
RRR

More Telugu News