Ramcharan: ‘చరణ్’ అని పలకడం రాక.. రామ్ చరణ్ కు క్షమాపణలు చెప్పిన అమెరికన్ నటి

actress tig notaro sorry ram charan hollywood critics awards event
  • హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన రామ్ చరణ్ 
  • ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టార్ రామ్.. అని కొంచెం గ్యాప్ ఇచ్చిన టిగ్ నొటారో 
  • తర్వాత చ్చారన్.. రామ్ చరాన్ అంటూ వేదికపైకి చరణ్ కు ఆహ్వానం
  • రామ్ చరణ్ కు ఎదురెళ్లి క్షమాపణ చెప్పిన అమెరికన్ నటి.. వీడియో వైరల్
రామ్ చరణ్ కు అమెరికన్ నటి టిగ్ నొటారో క్షమాపణలు చెప్పారు. చరణ్ పేరు ఎలా పలకాలో తెలియడం లేదంటూ సారీ చెప్పారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ వెళ్లారు. ఈ వేడుకలో ప్రజెంటర్ గా వ్యవహిరిస్తున్నచరణ్.. హాలీవుడ్ నటి అంజలి భీమానీతో కలిసి స్టేజ్ పైకి రావాల్సి ఉంది.

వారిద్దరినీ ఆహ్వానించే సమయంలో టిగ్ నొటారో తడబడ్డారు. ‘‘ఆర్ఆర్ఆర్ తో విజయం అందుకున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టార్ రామ్..’’ అని కొంచెం గ్యాప్ ఇచ్చారు. చివరి పేరు ఎలా పలకాలో తెలియడం లేదన్నారు. మైక్రో ఫోన్ లో వెనుక నుంచి పేరు చెప్పడంతో ‘చ్చరాన్’ అన్నారు. తనకు పక్క నుంచి సాయం చేశారని చెప్పారు. తర్వాత కూడా ‘రామ్ చరాన్’ అన్నారు. 

తర్వాత అంజలి భీమానీ పేరు పలకడంలోనూ ఇబ్బందిపడ్డారు. అంజలీ.. భీమానీ అంటూ గ్యాప్ ఇచ్చి పేరు పలికారు. దీంతో ఆడియన్స్ నవ్వేశారు. ఇక వారిద్దరూ స్టేజ్ ఎక్కి వస్తుండగా ఎదురెళ్లిన టిగ్ నొటారో.. రామ్ చరణ్ కు క్షమాపణలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టార్’ అంటూ స్టేజ్ పైకి చరణ్ ను ఆహ్వానించడంపై మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అంతర్జాతీయ వేదికపై ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని చరణ్ ప్రదానం చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Ramcharan
hollywood critics association awards
Tig notaro
anjali bhimani
The International Film Superstar
AlwaysRamCharan
HCAFilmAwards

More Telugu News