పుతిన్ మరో ఏడాది కూడా ఉండరంటున్న బహిష్కృత ఎంపీ
- క్రిమియాని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని పొనోమరేవ్ అంచనా
- అదే జరిగితే పుతిన్ పతనం ఖాయమన్న అంచనా
- చుట్టూ ఉన్న వారే పుతిన్ పతనాన్ని కోరుకోవచ్చన్న అభిప్రాయం
రష్యా క్రిమియాని స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా ఓటు వేసింది పొనోమరేవ్ ఒక్కరే కావడం గమనార్హం. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి పుతిన్ గెలిచినట్టు ఆయన లోగడ బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ‘‘ఉక్రెయిన్ ఆర్మీ ఏదో ఒక రోజు క్రిమియాలోకి ప్రవేశిస్తుంది. అది పుతిన్ పాలనకు ముగింపు పలుకుతుంది. పుతిన్ ప్రస్తుతం తాను ఉన్న స్థానం నుంచి చూస్తే.. అలాంటి సైనిక ఓటమిని ఆయన తట్టుకుని నిలబడలేరు’’అని పొనోమరేవ్ అన్నారు. మరో కోణంలో పుతిన్ ను తన అనుయాయులే పడగొట్టొచ్చని కూడా అంచనా వేస్తున్నారు.