Tollywood: దసరాలో ధరణిగా నాని.. లుంగీ కట్టుకొని క్రికెట్​ ఆడుతున్న మాస్ సీన్​ రిలీజ్

 firebrand Dharani glimps from nanis Dasara movie
  • నాని పుట్టిన రోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల
  • హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేశ్
  • మార్చి 30న విడుదల అవుతున్న చిత్రం
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి అనుకోకుండా హీరోగా మారిన నాని టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగాడు. తనదైన సహజ నటనతో  ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పలు వైవిధ్యభరిత చిత్రాల్లో నటించిన నాని ఇప్పటిదాకా పూర్తి స్థాయి మాస్ సినిమా చేయలేదు. దసరా చిత్రంతో ఆ కోరిక నెరవేరనుంది. శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని పూర్తిస్థాయి మాస్‌ క్యారెక్టర్‌‌లో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బొగ్గు గనుల నేపథ్యంలో గ్రామీణ వాతావరణంలో  శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. 

 శుక్రవారం నాని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు మరో కానుక అందించింది. నాని మాస్ క్యారెక్టర్ పవర్ చూపెట్టే మరో వీడియో గ్లింప్స్ విడుదల చేసింది. ఈ చిత్రంలో నాని ఫైర్ బ్రాండ్‌ ధరణి పాత్రలో నటిస్తున్నాడు. లుంగీ పైకి కట్టి, కళ్లజోడు పెట్టి, బీడీ తాగుతూ క్రికెట్ ఆడిన నాని.. షాట్ కొట్టగానే.. బ్యాట్‌ని గాల్లో విసిరేసి నడుచుకుంటూ వచ్చే సీన్‌ ఆసక్తికరంగా ఉంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం వేసవి కానుకగా మార్చి 30న విడుదల కానుంది.
Tollywood
Nani
dasara movie
new video

More Telugu News