'ప్రాజెక్టు K'తో నా కోరిక నెరవేరుతుంది: అశ్వనీదత్

  • 'సీతా రామం' బడ్జెట్ గురించి ప్రస్తావించిన అశ్వనీదత్
  • నెల రోజుల పాటు కశ్మీర్ లో షూట్ చేశామని వెల్లడి 
  • ఆ విషయంలో అసంతృప్తిగా ఉందని వ్యాఖ్య 
  • 'ప్రాజెక్టు K ' పై గట్టి నమ్మకం ఉందన్న నిర్మాత

Ashwini Dutt Interview

సీనియర్ ఎన్టీఆర్ తో సినిమాల నుంచి నిన్న మొన్నటి వరకు వచ్చిన 'సీతా రామం' వరకూ వైజయంతీ మూవీస్ నుంచి ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయి. తాజాగా 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్వనీ దత్ మాట్లాడుతూ .. 'సీతా రామం' సినిమా కోసం 54 కోట్లు ఖర్చు పెట్టాము. ఆ సినిమాకి ముందు హీరోయిన్ గా మృణాళిని ఠాకూర్ .. దర్శకుడిగా హను రాఘవపూడి నుంచి భారీ హిట్లు రాలేదు. అయినా మేము ఖర్చుకు వెనుకాడలేదు" అన్నారు. 

"ఈ సినిమా కథలో ఎక్కువ భాగం కశ్మీర్ లో చిత్రీకరించాము. నెల రోజుల పాటు అక్కడే ఉండిపోయాము. ఆ తరువాత రష్యా .. గుజరాత్ లలోను షూట్ చేశాము. ఇంత ఖర్చు పెడుతున్నాము .. వస్తుందా .. లేదా అనే ఆలోచన కూడా మేము చేయలేదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇంత పెద్ద విజయాన్ని సాధించినప్పటికీ ఒక అసంతృప్తి ఉండిపోయింది. ఈ సినిమా 100 రోజులు ఆడలేదే .. ఆ ఫంక్షన్ చేయలేకపోయామే అనిపించింది" అన్నారు. 

"ఈ రోజుల్లో ఏ సినిమా రిలీజ్ అయినప్పటికీ ఫస్టు వీకెండ్ వరకూ థియేటర్లలో ఉంటేచాలు అనుకుంటున్నారు. తొలి రోజునే సినిమాను వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో వేస్తుండటం కూడా 100 రోజుల గురించిన ఆలోచన చేయనీయడం లేదు. 100 రోజుల ఫంక్షన్ చేయాలనే నా కోరిక 'ప్రాజెక్టు K'తో నెరవేరుతుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News