Nara Lokesh: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి: నారా లోకేశ్

Lokesh insists Jr NTR should come into politics
  • తిరుపతి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • అభివృద్ధిని కోరుకునేవారు రాజకీయాల్లోకి రావాలని పిలుపు
  • రాజకీయాలకు కావాల్సింది మంచి మనసు అని వ్యాఖ్యలు
  • 2014లో పవన్ మంచి మనసును చూశానని వెల్లడి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. 

రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే తాను పవన్ కల్యాణ్ లో మంచి మనసును చూశానని లోకేశ్ వెల్లడించారు. 

కాగా, లోకేశ్ పాదయాత్రలో భాగంగా నేడు ఆటోడ్రైవర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, తద్వారా నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం బాగుపడాలంటే బాబు రావాలని అన్నారు.
Nara Lokesh
Junior NTR
Pawan Kalyan
Politics
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News