Ram Charan: రామ్ చరణ్ కు 'క్రిటిక్స్ ఛాయిస్' అవార్డుల్లో ఉత్తమ నటుడిగా నామినేషన్

Ram Charan gets Best Actor nomination for RRR in The Film Critics Choice Super Awards
  • హాలీవుడ్ లోనూ ఆర్ఆర్ఆర్ మేనియా
  • రామ్ చరణ్ కు ప్రత్యేక గుర్తింపు
  • బెస్ట్ యాక్షన్ మూవీ కేటగిరీలో బెస్ట్ యాక్టర్ నామినేషన్
  • మార్చి 16న విజేతల ప్రకటన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ చేరింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన నటన ప్రేక్షకులనే కాదు... లెజెండరీ హాలీవుడ్ దర్శక నిర్మాతల వరకు అందరినీ ఆకట్టుకుంది. రామ్ పాత్రలో నటన గురించి జేమ్స్ కామరూన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించడం తెలిసిందే. 

తాజాగా రామ్ చరణ్ నటనా ప్రతిభకు మరో గుర్తింపు లభించింది. క్రిటిక్స్ చాయిస్ సూపర్ అవార్డుల్లో ఉత్తమ నటుడు (బెస్ట్ యాక్షన్ మూవీ) కేటగిరీలో రామ్ చరణ్ కు నామినేషన్ లభించింది. 

అమెరికాలోని క్రిటిక్స్ ఛాయిస్ అసోసియేషన్ రెండేళ్లుగా 'ది క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్' పేరుతో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు ఇస్తుంది. మార్చి 16న విజేతల వివరాలను ప్రకటిస్తారు. 

కాగా, స్వామి మాలతో అమెరికా వెళ్లిన రామ్ చరణ్... అక్కడ ఆలయంలో మాల తీశారు. గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళితే... ఆయన్ను చూడటం కోసం అభిమానులు బారులు తీరారు. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో సింపుల్ గా చరణ్ కూర్చున్న తీరు గురించి హోస్ట్ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. 

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయన 15వ సినిమా అది. ఆ తర్వాత సానా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
Ram Charan
Nomination
Best Actor
RRR
The Film Critics Choice Super Awards
USA
Tollywood

More Telugu News