Hyderabad: చౌరస్తాలోని వ్యక్తికి గుండెపోటు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Traffic cop performs CPR saves life of a person in Hyderabad
  • రంగారెడ్డి జిల్లా ఆరంఘార్ చౌరస్తాలో ఘటన
  • బస్సు దిగి ఒక్కసారిగా కుప్పకూలిన బాలరాజు అనే యువకుడు
  • సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన కానిస్టేబుల్ రాజశేఖర్
  • వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం
ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి నిండు ప్రాణాన్ని కాపాడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంఘార్ చౌరస్తా బస్టాప్ లో బాలరాజు అనే యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ హుటాహుటిన యువకుడి దగ్గరకు పరుగులు తీశారు. యువకుడికి గుండె పోటు వచ్చిందని అర్థం కావడంతో సదరు కానిస్టేబుల్ ఎంతో సమయస్పూర్తితో సీపీఆర్ చేశారు.

దాంతో, బాలరాజు తిరిగి ఊపిరి తీసుకున్నాడు. అనంతరం అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా యువకుడు పడిపోయిన వెంటనే ఎంతో సమయస్పూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టిన కానిస్టేబుల్‌ పట్ల ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ లో షేర్ చేశారు.
Hyderabad
Police

More Telugu News