Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి నా కొడుకు క్లీన్ గా బయటికొస్తాడు: మాగుంట శ్రీనివాసులురెడ్డి

My son will come out with cleanchit from the Delhi liquor scam says magunta
  • తన కొడుకు రాఘవరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదన్న మాగుంట
  • తమ కుటుంబం 32 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఏ తప్పు చేయకుండా ఉందని వ్యాఖ్య
  • దేశంలోని పది రాష్ట్రాల్లో తమ వ్యాపారాలు కొనసాగుతున్నాయని వెల్లడి
తన కొడుకు రాఘవరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన కొడుకు క్లీన్ గా బయటికి వస్తాడని చెప్పారు. ఈ రోజు ఒంగోలులో మాగుంట మీడియాతో మాట్లాడారు. ‘పెద్దనాన్న పేరును, మీ పేరును అప్రతిష్టపాలు చేసేలా నేను వ్యవహరించలేదు’ అని రాఘవరెడ్డి తనకు చెప్పాడని అన్నారు.

తమ కుటుంబం 32 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఏ తప్పు చేయకుండా ఉందని, 70 ఏళ్లుగా తమ కుటుంబం వ్యాపారాలు నిర్వహిస్తోందని మాగుంట చెప్పారు. వ్యాపారాల్లోనూ ఎవరూ తమను వేలెత్తి చూపలేదని అన్నారు. దేశంలోని పది రాష్ట్రాల్లో తమ వ్యాపారాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 

తన కుమారుడు ఏ తప్పు చేయలేదని, అందరూ ఆశీర్వదించాలని మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరారు. రాజకీయ కుట్రలతో అరెస్టు చేశారని, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూడటం మంచి పరిణామం కాదన్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి 2022 అక్టోబర్ లో రాఘవరెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసాల్లో గతంలో సోదాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
Delhi Liquor Scam
Magunta Sreenivasulu Reddy
Magunta raghava reddy
YSRCP

More Telugu News