Kotamreddy Sridhar Reddy: అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న కోటంరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు!

Kotamreddy Sridhar Reddy Knocked High Court Doors In A Case
  • టీడీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు కోటంరెడ్డిపై కేసు నమోదు
  • వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న కోర్టు
  • విచారణ రెండు వారాలకు వాయిదా

వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. టీడీపీ కార్యకర్త మాతంగి వెంకటకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటంరెడ్డిపై వేదాయపాలెం పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం, ఐపీసీ 307 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, కేసు దర్యాప్తును నిలిపివేయడంతోపాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. 

నిన్న ఈ  పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులు, వెంకటకృష్ణకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో ఫిర్యాదుదారుడి వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News