TTD: నేటి సాయంత్రం శ్రీవారి వర్చువల్ సేవా టికెట్ల మార్చి నెల కోటా విడుదల

Lord Srivaru Virtual Service Tickets for March released today
  • మార్చి నెల రూ. 300 టికెట్ల ఆన్‌లైన్ కోటా ఈ ఉదయం 10 గంటలకు విడుదల
  • మధ్యాహ్నం రెండు గంటలకు ఏప్రిల్, మే నెల అంగప్రదక్షిణం టోకెన్ల జారీ
  • సాయంత్రం నాలుగు గంటలకు వర్చువల్ సేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. వేసవి నేపథ్యంలో మున్ముందు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, మార్చి నెలకు గాను రూ. 300 టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

అలాగే, ఏప్రిల్, మే నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టోకెన్లను మధ్యాహ్నం రెండు గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక, మార్చి నెలకుగాను కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవా టికెట్ల కోటాను నేటి సాయంత్రం నాలుగు గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు.
TTD
Tirumala
Tirupati
Andhra Pradesh

More Telugu News