Chandrababu: రేపు గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు

Chandrababu will visit Gannavaram TDP office tomorrow
  • ఇటీవల గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి
  • ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం
  • కారుకు నిప్పంటించిన వైనం
  • వల్లభనేని వంశీ అనుచరులకు, టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రేపు కృష్ణా జిల్లా గన్నవరంలో పర్యటించనున్నారు. ఇటీవల వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన టీడీపీ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ నేత దొంతు చిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. 

గన్నవరం ఘటనపై చంద్రబాబు ఇప్పటికే బహిరంగలేఖ ద్వారా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై ఈ నెల 20న దాడి జరిగింది. ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతోపాటు, ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించారు. 

ఈ ఘటన నేపథ్యంలో, గన్నవరంలో వల్లభనేని వంశీ అనుచరులు, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, దొంతు చిన్నా తదితర టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
Chandrababu
TDP Office
Gannavaram

More Telugu News