Sensex: ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లకు నష్టాలే

  • 139 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 43 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా నష్టపోయిన ఏసియన్ పెయింట్స్ షేర్ విలువ
Markets ends in losses

నిన్న కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలనే మూటకట్టుకున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరకు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 139 పాయింట్లు నష్టపోయి 59,605కి పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 17,511కి దిగజారింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (1.44%), ఐటీసీ (0.98%), టాటా మోటార్స్ (0.86%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.86%), టాటా స్టీల్ (0.67%). 

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-3.20%), ఎల్ అండ్ టీ (-1.40%), టైటాన్ (-1.34%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.30%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.01%).

More Telugu News