Moon: చంద్రుడు, శుక్రుడు, గురువు పక్కపక్కనే.. నింగిలో అరుదైన దృశ్యం

  • బుధవారం రాత్రి ఆకాశంలో చోటు చేసుకున్న అద్భుతం
  • ఒకదానికొకటి చేరువ అవుతున్న శుక్రుడు, గురుడు
  • వీటికి చేరువగా వచ్చి వెళ్లిన చంద్రుడు
Moon Venus and Jupiter form the perfect trifecta in skies across the world

నింగిలో అరుదైన దృశ్యం చోటు చేసుకోనుంది. చంద్రుడు, శుక్రుడు, గురువు పక్కపక్కనే చేరడాన్ని చూడొచ్చు. దీంతో త్రికోణం మాదిరి ఇవి కనిపించాయి. ఈ మూడు గ్రహాలు ఒకదానికొకటి సమీపంగా చేరడం వల్లే ఇది సాధ్యమైంది. 

శుక్రుడు, గురుడు ఒకదానికొకటి చేరువ అవుతున్నాయి. వీటి పక్కకు బుధవారం సాయంత్రం చంద్రుడు వచ్చి చేరాడు. ప్రపంచవ్యాప్తంగా ఇది కనిపించింది. గురువారం కూడా కనిపించనుంది. మార్చి 1 నాటికి శుక్రుడు, గురుడు మరింత దగ్గర కానున్నారు. నింగిలో సూర్యుడు, చంద్రుడు తర్వాత అత్యంత ప్రకాశవంతంగా కనిపించే మూడో గ్రహం శుక్రుడు కావడం గమనార్హం. బుధవారం సాయంత్రం ఈ మూడు గ్రహాలు చేరువ అయిన సమయంలో తీసిన ఫొటోలు నెట్ ప్రపంచంలోకి చేరిపోయాయి. 


More Telugu News