sleep: ఈ చిట్కాలతో హాయిగా నిద్రించవచ్చు !

  • మారిన జీవనశైలి వల్ల నిద్రలేమి బాధితుల పెరుగుదల 
  • రాత్రిపూట ఏడెనిమిది గంటల నిద్ర అవసరం అంటున్న నిపుణులు
  • రోజంతా అలసిన శరీరానికి విశ్రాంతి లభించేది నిద్రలోనేనని వెల్లడి
Try these home remedies and you will fall asleep as soon as you go to bed

పొద్దంతా అలసిన శరీరానికి విశ్రాంతి లభించేది రాత్రి నిద్రలోనే.. ఏడెనిమిది గంటల నిద్ర శారీరక అలసటను దూరం చేస్తుంది. వ్యాధులను దరిచేరకుండా అడ్డుకుంటుంది. అయితే, మారుతున్న జీవనశైలి వల్ల ప్రస్తుతం చాలామంది అర్ధరాత్రి దాటేదాకా నిద్రపోవడంలేదు. పడుకుందామని ప్రయత్నించినా నిద్రాదేవి కరుణించడంలేదని వాపోతుంటారు. ఉద్యోగం, వ్యాపార బాధ్యతల వల్ల ఉదయాన్నే లేచి ఉరుకులు పరుగులు పెట్టే వారికి రాత్రిపూట సరైన నిద్రలేకపోతే ఇబ్బందే. నిద్రలేమి వల్ల మరుసటి రోజంతా అలసట, నీరసంతో బాధపడుతుంటారు. అయితే, కొన్ని చిట్కాలతో రాత్రిపూట హాయిగా నిద్రించ వచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పడుకునే ముందు పాదాలను ఆవాల నూనెతో కాసేపు మర్దించడం వల్ల ఒత్తిడి తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సుఖ నిద్ర పొందుతారని చెప్పారు. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చని పాలల్లో అశ్వగంధ పొడిని కలిపి తాగాలని సూచిస్తున్నారు. దీనివల్ల నిద్రాదేవి కోసం ఎదురుచూడాల్సిన అవసరం తప్పుతుందని, హాయిగా నిద్రిస్తారని పేర్కొన్నారు. పాలల్లో కాస్త తేనె కలుపుకుని తాగినా ఫలితం ఉంటుందని వివరించారు. మనస్సును రిలాక్స్ చేసేందుకు చామంతి టీ దివ్యౌషధంగా పనిచేస్తుందని, నిద్రలేమి సమస్యను తగ్గించేందుకు ఇది తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News