Sensex: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

  • 927 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 272 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2.86 శాతం పతనమైన బజాజ్ ఫైనాన్స్ షేర్ విలువ
Sensex looses 927 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో ఈ ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే భయాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి. వీటితో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ట్రేడింగ్ చివరి వరకు సూచీలు పతనమవుతూనే వచ్చాయి. 

ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 927 పాయింట్లు నష్టపోయి 59,744కి పడిపోయింది. నిఫ్టీ 272 పాయింట్లు పతనమై 17,554కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ (0.41%) మాత్రమే లాభపడింది. బజాజ్ ఫైనాన్స్ (-2.86%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.45%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.37%), రిలయన్స్ (-2.28%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.98%) టాప్ లూజర్లుగా నిలిచాయి.    

More Telugu News