Alia Bhatt: పక్కింటి నుంచి.. అలియాభట్ ఏకాంత ఫొటోలను క్లిక్ మనిపించిన ఫొటోగ్రాఫర్లు

Bandra Police contacts Alia Bhatt over invasion of privacy at home ask her to file complaint
  • ఓ మీడియా సంస్థ చేసినట్టు ఆరోపణలు
  • ఇన్ స్టా గ్రామ్ లో మండి పడ్డ అలియాభట్
  • ఎక్కడైనా ఇలాంటివి ఆమోదిస్తారా? అంటూ ప్రశ్నించిన నటి
నటి అలియా భట్ తాను ఒంటరిగా ఉన్న సమయంలో ఫొటోలు తీయడంపై మండిపడింది. దీనిపై ఇన్ స్టా గ్రామ్ లో సీరియస్ గా స్పందించింది. తాను లివింగ్ రూమ్ లో ఉన్న సమయంలో అనుమతి లేకుండా ఫొటోలు తీయడాన్ని ఆమె తన పోస్ట్ ద్వారా తప్పుబట్టింది. 

‘‘నాతో ఆటలాడుకుంటున్నారా? నేను నా ఇంట్లో ఉన్నాను. మధ్యాహ్న సమయంలో లివింగ్ రూమ్ లో కూర్చుని, ఏదో చూస్తూ ఆస్వాదిస్తున్న సమయంలో.. నా పక్కనున్న బిల్డింగ్ టెర్రస్ నుంచి ఇద్దరు మగవారు కెమెరా నా వైపు పెట్టి ఉంచడాన్ని గమనించాను. ఎక్కడైనా ఇలాంటివి ఆమోదిస్తారా? ఒకరి ప్రైవసీని పూర్తిగా కాలరాయడమే ఇది. దాటకూడని నియంత్రణ రేఖ అంటూ ఒకటి ఉంటుంది. కానీ, మీరు ఈ రోజు అన్ని నియంత్రణ రేఖలను ఉల్లంఘించారు’’ అని అలియా భట్ పోస్ట్ పెట్టింది. సదరు ఫొటోలను ఓ మీడియా పోర్టల్ ప్రతినిధులు తీసినట్టు తెలుస్తోంది.

దీనిపై అనుష్క శర్మ స్పందిస్తూ.. సదరు సంస్థ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని, రెండేళ్ల క్రితం తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ పోస్ట్ పెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో ముంబై పోలీసులు అలియాభట్ ను సంప్రదించారు. సంబంధిత పోర్టల్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు ఇస్తే చర్యలు చేపడతామని చెప్పారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు అలియాభట్ కు కాల్ చేసి మద్దతు ప్రకటిస్తున్నారు. 
Alia Bhatt
privacy break
photos
mumbai police

More Telugu News