Bengaluru: అద్భుతం! తెగిపోయిన చేతిని అతికించిన వైద్యులు

Severed wrist successfully restored at Bengaluru hospital
  • యంత్రాన్ని పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు మణికట్టు వరకు తెగిపడిన చేయి
  • చేయితోపాటు బాధితుడిని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
  • ఏడు గంటలపాటు ఆపరేషన్ చేసి చేయిని అతికించిన వైద్యులు
వైద్యులు అద్భుతం చేశారు. తెగిపోయిన చేతిని తిరిగి అతికించారు. బెంగళూరులో జరిగిందీ ఘటన. నగరానికి చెందిన ఓ వ్యక్తి (55) ఓ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కంపెనీకి ఇటీవల కొత్తగా వచ్చిన ఓ యంత్రాన్ని పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు చెయ్యి అందులో పడి మణికట్టు వరకు తెగిపోయింది. 

వెంటనే అప్రమత్తమైన ఫ్యాక్టరీ సిబ్బంది తెగిపడిన చేయితో పాటు బాధితుడిని వెంటనే నగరంలోని బన్నేరుఘట్‌లో ఉన్న ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఏడు గంటలపాటు ఆపరేషన్ చేసి తెగిపడిన చేతిని విజయవంతంగా అతికించినట్టు ఆసుపత్రి సర్జన్ సత్యవంశీకృష్ణ తెలిపారు.
Bengaluru
Fortis Hospital
Severed wrist

More Telugu News