Turkey: భూకంపం వస్తే ఎలా ఉంటుందో చూశారా?.. వీడియో ఇదిగో!

  • చేత్తో పట్టుకుని ఊపినట్టుగా ఊగిపోయిన భూమి
  • కారు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డయిన దృశ్యం
  • 50 వేలకు చేరిన టర్కీ, సిరియా భూకంప మృతుల సంఖ్య
Video Showing Earthquake in Turkey

భూకంపం వస్తే ఎలా ఉంటుంది? ఆ సమయంలో ఏం జరుగుతుంది? అనుభవానికి తప్ప చూసేందుకు వీలుకాని ప్రశ్న ఇది. అయితే, సీసీ కెమెరాల పుణ్యమా అని ఇప్పుడు అన్నీ చూడగలుగుతున్నాం. తాజాగా టర్కీ(తుర్కియే)లో సోమవారం రాత్రి 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 294 మంది గాయపడ్డారు. వీరిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, ఇటీవల సంభవించిన భారీ భూకంపం ధాటికి దెబ్బతిన్న భవనాలు తాజా భూకంపానికి కుప్పకూలాయి. 

కాగా, సోమవారం రాత్రి సంభవించిన భూకంపం ఓ కారు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. భూమిని ఎవరో చేత్తో పట్టుకుని ఊపినట్టుగా ఒక్కసారిగా ఊగిపోయింది. కొన్ని క్షణాల పాటు భూమి అలా కంపించింది. కాగా, రెండువారాల క్రితం టర్కీ, సిరియాల్లో 7.8 తీవ్రతతో  సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 50 వేల మంది మరణించారు. టర్కీ, సిరియాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

More Telugu News