నా పాదయాత్రలో 'వజ్ర' వాహనం ఎందుకు?: నారా లోకేశ్

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర
  • లోకేశ్ పాదయాత్రలో వజ్ర వాహనం మోహరింపు
  • సీఎం జగన్ కు ఎందుకంత భయం అని ప్రశ్నించిన లోకేశ్
Lokesh questions Vajra Vahan in his Padayatra

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో స్పందించారు. సీఎం జగన్ కు నేనంటే ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. నా పాదయాత్రలో వజ్ర వాహనం మోహరించాల్సిన అవసరం ఏముంది? అని నిలదీశారు. మత కలహాలు, ఘర్షణలు చెలరేగినప్పుడే వజ్ర వాహనం ఉపయోగిస్తారని లోకేశ్ పేర్కొన్నారు. 

తన యువగళం పాదయాత్ర శాంతియుతంగానే కొనసాగుతోందని స్పష్టం చేశారు. కానీ జగన్ ఆదేశాలతో తన పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News