Pattabhi: కమిలిపోయిన అరచేతులను చూపుతూ కోర్టులోకి వెళ్లిన పట్టాభి

Police presents Pattabhi before Gannavarav court
  • పట్టాభిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • పట్టాభిని కస్టడీలో హింసించారన్న టీడీపీ
  • పట్టాబి అరచేతిని చూపుతున్న ఫొటో పంచుకున్న వైనం
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను గన్నవరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిన్న పట్టాభి అరెస్ట్ చోటుచేసుకోగా, నాటకీయ పరిణామాల మధ్య ఆయనను ఇవాళ గన్నవరం పీఎస్ కు తీసుకువచ్చారు. కాగా, కోర్టులోపలికి వెళ్లేముందు పట్టాభి కమిలిపోయిన అరచేతులను చూపించారు. దీనిపై టీడీపీ భగ్గుమంది. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు పట్టాభిని అరెస్ట్ చేసి, కస్టడీలో హింసించారని ఆరోపించింది. ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, పూర్తిగా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించింది. ఈ మేరకు పట్టాభి అరచేయి చూపుతున్న ఫొటోను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
Pattabhi
Court
TDP
Police

More Telugu News