surya kumar yadav: శ్రీవారిని దర్శించుకున్న సూర్య కుమార్ యాదవ్

team india cricketer surya kumar yadav visits tirumala temple
  • కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్న సూర్య
  • పట్టు వస్త్రాలతో సత్కరించిన అధికారులు
  • శ్రీవారి తీర్థ ప్రసాదాల అందజేత
తిరుమల శ్రీవారిని టీమిండియా క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ రోజు వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు.
 
తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను సూర్యకుమార్ యాదవ్ కు అందజేశారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆలయం బయట అభిమానులు సూర్య కుమార్ తో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు.

మిస్టర్ 360, స్కైగా పేరు పొందిన సూర్య.. టీ20, వన్డే మ్యాచ్ లలో సూపర్ ఫామ్ లో ఉన్నారు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలిసారి టెస్టుల్లోనూ చోటు దక్కించుకున్నారు. అయితే తొలి మ్యాచ్ లో పెద్దగా రాణించలేదు. దీంతో రెండో టెస్టులో బెంచ్ కే పరిమితం అయ్యాడు. మార్చి 1 నుంచి మూడో టెస్టు జరగనుంది. దీంతో సమయం ఉండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చాడు సూర్యకుమార్.
surya kumar yadav
tirumala temple
sky
TTD
team india cricketer

More Telugu News