sikkim: ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క రైలూ నడవలేదు!

  • సిక్కింలో రైల్వే స్టేషన్లు లేవు.. అసలు ట్రాకే లేదు
  • రాష్ట్రంలో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో రైల్వే ప్రాజెక్టులకు అడ్డంకులు
  • ప్రస్తుతం సివోక్, రాంగ్ పో మధ్య కొనసాగుతున్న పనులు.. త్వరలోనే రైళ్లు అందుబాటులోకి!
this indian state does not have a railway station

మెట్రోలు, వందే భారత్ రైళ్లు నడుస్తున్న జమానా ఇది. రానున్న రోజుల్లో బుల్లెట్ ట్రైన్లు కూడా దూసుకెళ్లనున్నాయి. కానీ మన దేశంలో ఎన్నడూ ఒక్క రైలు కూడా వెళ్లని రాష్ట్రం ఉందంటే నమ్ముతారా?

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదట. ఇప్పటిదాకా ఒక్క ట్రైన్ కూడా నడవలేదట. అక్కడి భౌగోళిక పరిస్థితుల వల్ల రైల్వే ట్రాక్ ను ఏర్పాటు చేయలేదు. మొత్తం పర్వత ప్రాంతాలతో నిండి ఉండటం.. అక్కడ రైల్వే లైను వేసేందుకు కావాల్సినంత టెక్నాలజీ గతంలో లేకపోవడంతో రైలు రవాణా అనేదే సిక్కింలో లేకుండా పోయింది. దీంతో రవాణా ఎక్కువగా రోడ్డు మార్గంలోనే సాగుతుంది.

2008లో మాత్రం ఓ అడుగు పడింది. పశ్చిమ బెంగాల్ ను సిక్కింతో కలిపేందుకు సివోక్, రాంగ్ పో మధ్య రైలు మార్గం నిర్మించాలని రైల్వే శాఖ ప్రణాళిక వేసింది. అభయారణ్యాలు ఉండటం, కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటం, నిధుల కేటాయింపులో జాప్యం కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగలేదు.

అయితే 2016లో అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో పనులు వేగవంతమయ్యాయి. 2021 నాటికి రైల్వే ప్రాజెక్టు ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అక్కడ తొలిసారి రైలు కూత పెట్టనుంది. త్వరలో రెండో దశలో గ్యాంగ్ టక్ కు రైళ్ల సర్వీసులను ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు.

More Telugu News