చరణ్ జోడీగా తెరపైకి 'సీతారామం' బ్యూటీ పేరు!

  • 'సీతా రామం'తో భారీ హిట్ కొట్టిన మృణాల్ 
  • వైజయంతీ బ్యానర్లో మరో సినిమా చేయనుందనే టాక్ 
  • నానీ 30వ సినిమాలో దక్కిన ఛాన్స్ 
  • నాగ్ నెక్స్ట్ ప్రాజెక్టులోను చేయనుందని ప్రచారం 
  • బుచ్చిబాబు సినిమాకి సంబంధించి వెలువడనున్న అధికారిక ప్రకటన
Mrunal Thakur in Ramchaaran Movie

బుల్లితెర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ క్రేజ్ తో వెండితెరకి వచ్చి పాప్యులర్ అయినవారు కొంతమంది ఉన్నారు. ఆ జాబితాలో మృణాల్ ఠాకూర్ కూడా కనిపిస్తుంది. ఆమె నటించిన 'కుంకుమ్ భాగ్య' సీరియల్ కి అప్పట్లో విశేషమైన ఆదరణ లభించింది. దాంతో ప్రతి ఇంట్లోని వారు ఆమెను తమ కుటుంబ సభ్యురాలిగా భావించారు. 

మరాఠీ సినిమా ద్వారా వెండితెరకి పరిచయమైన ఆమె, ఆ తరువాత హిందీ సినిమాలు చేస్తూ వెళ్లింది. ఈ నేపథ్యంలోనే తెలుగులో ఆమె చేసిన 'సీతారామం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దాంతో సహజంగానే ఇండస్ట్రీ దృష్టి ఆమె వైపు మళ్లింది. తమ నెక్స్ట్ ప్రాజెక్టులలో ఆమెను బుక్ చేయడానికి మేకర్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఆమె మరో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నాని 30వ సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. ఇక నాగ్ తదుపరి సినిమాలోనూ ఆమెనే హీరోయిన్ అంటున్నారు. బుచ్చిబాబుతో చరణ్ చేయనున్న సినిమాలో కథానాయికగా మృణాళ్ నే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. 

More Telugu News