Pattabhi: నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు: టీడీపీ నేత పట్టాభి భార్య

TDP Pattabhirams wife press meet
  • పట్టాభి అరెస్టు వార్తలపై ఆయన భార్య ఆందోళన
  • తన భర్త ఎక్కడున్నారో ఇంతవరకూ తెలియలేదని వెల్లడి
  • పోలీసులు వివరాలు వెల్లడించకపోతే నిరాహారదీక్ష చేస్తానని ప్రకటన
టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేసిన ఘటన నేపథ్యంలో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాడి విషయం తెలిసి గన్నవరం వెళ్లిన టీడీపీ నేత పట్టాభిరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 

ఈ క్రమంలో పట్టాభి కనిపించకపోవడంపై ఆయన భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలిసి నా భర్త గన్నవరం కార్యాలయానికి వెళ్లారు. అక్కడికెళ్లాక ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆయన వివరాలు నాకు వెంటనే చెప్పకపోతే నేను డిజీపీ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసేందుకు నిర్ణయించుకున్నాను. నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఆయనకు ఏం జరిగినా సీఎం, డిజీపీదే బాధ్యత’’ అని ఆమె తేల్చి చెప్పారు.
Pattabhi

More Telugu News