Tirupati: తిరుపతిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు.. మహిళా ఎస్సై తల్లి, తమ్ముడి అరెస్ట్!

Woman SI Mother and Brother Caught In Prostitution Case In Tirupati
  • ముత్యాలరెడ్డిపల్లి సమీపంలోని ధనలక్ష్మి నగర్‌లో ఘటన
  • మహిళా ఎస్సైకి ఏడాది క్రితమే వివాహం
  • భర్తతో కలిసి వేరుగా ఉంటున్న ఎస్సై
  • కుమారుడితో కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తున్న తల్లి

తిరుపతిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఓ మహిళా ఎస్సై తల్లి, తమ్ముడు దొరకడం కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం మహిళా ఎస్సైకి ఏడాది క్రితమే వివాహమైంది. దీంతో ఆమె భర్తతో కలిసి వేరుగా నివసిస్తోంది.

ఆమె తల్లి, సోదరుడు ముత్యాలరెడ్డిపల్లి సమీపంలోని ధనలక్ష్మి నగర్‌లో ఉంటున్నారు. వీరిద్దరూ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గత రాత్రి ఇంటిపై దాడిచేశారు. మహిళా ఎస్సై తల్లి, ఆమె సోదరుడితోపాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన మరో ఇద్దరు యువతులను హోంకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News