Team India: వర్షంతో నిలిచిన మ్యాచ్... వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన భారత అమ్మాయిలు

  • దక్షిణాఫ్రికా వేదికగా టీ20 వరల్డ్ కప్
  • టీమిండియా వర్సెస్ ఐర్లాండ్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 రన్స్ చేసిన భారత్
  • ఐర్లాండ్ లక్ష్యఛేదనకు వర్షం అడ్డంకి
  • 8.2 ఓవర్ల వద్ద నిలిచిపోయిన మ్యాచ్
  • డీఎల్ఎస్ ప్రకారం 5 రన్స్ తేడాతో భారత్ విక్టరీ
Team India eves enters into semis in T20 World Cup

మహిళల టీ20 ప్రపంచకప్ లో టీమిండియా సెమీఫైనల్లో ప్రవేశించింది. ఇవాళ ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా డక్ వర్త్ లూయిస్ విధానంలో 5 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. 

ఐర్లాండ్ లక్ష్యఛేదనలో 8.2 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం విజేతను నిర్ణయించారు. 

వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఐర్లాండ్ స్కోరు 2 వికెట్లకు 54 పరుగులు. డీఎల్ఎస్ ప్రకారం అప్పటికి 59 పరుగులు చేసుంటే ఐర్లాండే గెలిచేది. కానీ, ఐర్లాండ్ 5 పరుగులు వెనుకబడి ఉంది. దాంతో భారత్ ను విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో టీమిండియా అమ్మాయిలు సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నారు.

More Telugu News