Nara Lokesh: విరామం అనంతరం నారా లోకేశ్ పాదయాత్ర రేపు తిరిగి ప్రారంభం

  • గత నెల 27న లోకేశ్ యువగళం ప్రారంభం
  • పాదయాత్రకు రెండ్రోజుల విరామం
  • ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర
Lokesh Yuvagalam restarts from tomorrow

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు రెండు రోజుల విరామం రావడం తెలిసిందే. వాస్తవానికి ఆయన శివరాత్రి సందర్భంగా విరామం తీసుకున్నారు. అయితే నందమూరి తారకరత్న కన్నుమూయడంతో ఆయనకు నివాళులు అర్పించేందుకు లోకేశ్ ఇవాళ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, లోకేశ్ యువగళం పాదయాత్ర రేపటి నుంచి యథావిధిగా కొనసాగనుంది. 


లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు...

ఇప్పటి వరకు నడిచిన దూరం 296.6 కిలోమీటర్లు

యువగళం పాదయాత్ర 23వ రోజు షెడ్యూల్ (21.02.2023)
ఉదయం
8.00 - శ్రీకాళహస్తి ఆర్టీవో ఆఫీస్ ఎదుట విడిది కేంద్రంలో ముస్లింలతో ముఖాముఖి.
9.00 – పాదయాత్ర ప్రారంభం.
9.20 - మిట్టకండ్రిగలో స్థానికులతో మాటామంతీ.
11.00 -  తొండంనాడులో స్థానికులతో మాటామంతీ.
11.15 - తొండమానుపురం దిగువ వీధిలో 300 కి.మీ పూర్తి అయిన సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ.
11.20 - తొండమానుపురం దిగువ వీధిలో మహిళలతో ముఖాముఖి.
మధ్యాహ్నం
12.10 - సుబ్బానాయుడు కండ్రికలో స్థానికులతో మాటామంతీ.
1.30 - వెంకటాపురంలో భోజన విరామం 
2.30 - బండారుపల్లిలో వన్యకుల క్షత్రియులతో సమావేశం.
సాయంత్రం
4.00 – బండారుపల్లిలో స్థానికులతో మాటామంతీ.
5.30 - కోబాక విడిది కేంద్రంలో బస.

More Telugu News