Sensex: అమెరికా ఫెడ్ రిజర్వ్ భయాలు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచబోతోందనే భయాలు
  • 311 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 99 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయినప్పటికీ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచబోతోందనే భయాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి  సెన్సెక్స్ 311 పాయింట్లు కోల్పోయి 60,691కి పడిపోయింది. నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 17,844 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (1.75%), టెక్ మహీంద్రా (1.35%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.91%), టాటా మోటార్స్ (0.67%), ఇన్ఫోసిస్ (0.62%). 

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.33%), మారుతి (-1.33%), కోటక్ బ్యాంక్ (-1.26%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.18%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.09%).

More Telugu News