Vivo V27: గూగుల్ పిక్సల్ కు పోటీగా వస్తున్న వివో వీ27

Vivo V27 India launch set for March 1 likely to take on Pixel 6a
  • మార్చి 1న విడుదల
  • ట్విట్టర్ లో ప్రకటించిన వివో
  • రూ.30వేల స్థాయిలో ధర ఉండొచ్చని అంచనా
  • కర్వ్ డ్ డిస్ ప్లే, స్లీక్ డిజైన్
వివో వీ27 5జీ స్మార్ట్ ఫోన్ మార్చి 1న విడుదల కాబోతోంది. గూగుల్ పిక్సల్ 6కు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. మార్చి 1న విడుదల చేయనున్నట్టు వివో ధ్రువీకరించింది. దీనికి సంబంధించి తన ట్విట్టర్ పేజీలోనూ ప్రకటనలు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం రూ.30వేల శ్రేణిలో మంచి కెమెరా ఫోన్ గా గూగుల్ పిక్సల్ 6 స్థానం దక్కించుకుంది. దీనికి వివో 27 పోటీనిస్తుందా? లేదా? అన్నది విడుదల తర్వాతే తెలియనుంది.

ప్రస్తుతం గూగుల్ పిక్సల్ 6ఏ ధర రూ.29,999 నుంచి మొదలవుతుంటే, వివో వీ27 ధర ఇంతకులోపు ఉండొచ్చని తెలుస్తోంది. వివో వీ27 ప్రీమియం డిజైన్ తో రానుంది. ఫొటోలు చూస్తే ఇదే తెలుస్తోంది. కర్వ్ డ్ డిస్ ప్లే, పంచ్ హోల్, స్లిమ్ డిజైన్ తో ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్ వోసీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివో ఇంకా ధరలు, స్పెసిఫికేషన్ల గురించి ప్రకటించలేదు. ప్రస్తుతం మన మార్కెట్లో వివో వీ25 అందుబాటులో ఉండగా, దీని ఆరంభ ధర రూ.27,999గా ఉంది. వీ27 ధర దీనికంటే ఎక్కువే ఉండే అవకాశాలున్నాయి.
Vivo V27
5g phone
launching

More Telugu News