iPhone: కర్ణాటకలోని హసన్ లో దారుణం.. ఐఫోన్ కోసం డబ్బులేక డెలివరీ బాయ్ హత్య

Unable to pay for iPhone Karnataka man kills delivery boy hides body for 4 days
  • సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్
  • క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్న కొనుగోలుదారు
  • డెలివరీకి వచ్చిన వ్యక్తి డబ్బులు చెల్లించాలని కోరడంతో హత్య
యాపిల్ ఐ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ చేశాడు 20 ఏళ్ల వ్యక్తి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నాడు. ఈ-కార్ట్ డెలివరీ బోయ్ ఐఫోన్ ను తీసుకువచ్చాడు. డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన యువకుడు.. తన దగ్గర చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో దారుణానికి పాల్పడ్డాడు. ఈ-కార్ట్ డెలివరీ బోయ్ ని హత్య చేశాడు. అతడి మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు తన ఇంట్లోనే రహస్యంగా ఉంచాడు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సమీపానికి తీసుకెళ్లి దహనం చేశాడు. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ పట్టణంలో ఈ ఘోరం జరిగింది. 

అంచ్ కొప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 11న కాలిన శరీరం వెలుగు చూడడంతో దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మరణించిన వ్యక్తిని హేమంత్ నాయక్ (23)గా గుర్తించారు. ఈ కార్ట్ ఎక్స్ ప్రెస్ ఉద్యోగిగా దర్యాప్తులో వెల్లడైంది. లక్ష్మీపుర లే అవుట్ సమీపంలో నివాసం ఉండే హేమంత్ దత్తా సెకండ్ హ్యాండ్ ఐఫోన్ ను బుక్ చేసుకోగా, దాన్ని డెలివరీ చేసేందుకు ఈ నెల 7న హేమంత్ నాయక్ వెళ్లాడు. రూ.46,000 చెల్లించాలని నాయక్ కోరడంతో... దత్తా కత్తితో దాడి చేసి హతమార్చాడు. మృతదేహాన్ని ప్యాక్ చేసి బండిపై పెట్టుకుని, రైల్వే స్టేషన్ సమీపంలో దహనం చేసినట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ రికార్డుల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
iPhone
order
flipkart
ecart
delivery boy
murdered

More Telugu News