Mohan Babu: తారకరత్నకు నివాళులు అర్పించడానికి మోహన్ బాబు రాకపోవడానికి కారణం ఇదే!

Reason why Mohan Babu not came to pay condolences to Tarakaratna
  • ప్రస్తుతం తాను లండన్ లో ఉన్నానన్న మోహన్ బాబు
  • మంచు విష్ణు సింగపూర్ లో ఉన్నాడని వెల్లడి
  • దీనివల్లే నివాళి అర్పించేందుకు రాలేకపోయామన్న మోహన్ బాబు
నందమూరి కుటుంబంతో ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు కుటుంబానికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. దివంగత ఎన్టీఆర్ ను అన్నగారు అని పిలిచే మోహన్ బాబు... తొలి నుంచి కూడా వారి కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఉంటున్నారు. అయితే, నందమూరి తారకరత్న మృతి వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియా ద్వారా ఆవేదనని వ్యక్తం చేసిన ఆయన... భౌతిక కాయానికి నివాళి అర్పించడానికి రాలేదు. 

దీంతో ఆయన ఎందుకు రాలేదనే ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. దీనికి ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తాను లండన్ లో, మంచు విష్ణు సింగపూర్ లో ఉండటం వల్ల వ్యక్తిగతంగా రాలేకపోతున్నామని ఆయన వివరించారు. తన అన్నగారైన నందమూరి తారక రామారావుగారి మనవడు తారకరత్న తనకు, తన కుటుంబానికి అత్యంత ఆత్మీయుడని చెప్పారు. ఆయన ఎంత మంచి వ్యక్తో, సౌమ్యుడో చెప్పడానికి తనకు మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Mohan Babu
Manchu Vishnu
Tarakaratna
Tollywood

More Telugu News