ఎంత ప్రయత్నించినా తారకరత్నను బతికించుకోలేకపోయాం: మురళీమోహన్

  • తారకరత్న కన్నుమూత
  • తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన మురళీమోహన్
  • ఇలా జరుగుతుందని ఊహించలేకపోయామని విచారం
  • మామయ్య గారూ అంటూ ఆప్యాయంగా పిలిచేవాడని వెల్లడి
Murali Mohan pays homage to Tarakaratna

ప్రముఖ నటుడు, ఎన్టీ రామారావు గారి మనవడు తారకరత్న అకాలమరణం చెందడం ఎంతో బాధ కలిగించిందని సీనియర్ నటుడు మురళీమోహన్ పేర్కొన్నారు. ఆయన ఇవాళ తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని అనుకున్నామే తప్ప, ఇలా జరుగుతుందని ఊహించలేకపోయామని తెలిపారు. చిత్ర పరిశ్రమ యావత్తు ఇవాళ దిగ్భ్రాంతికి గురైందని పేర్కొన్నారు. పాదయాత్రలో ఉండగా గుండెపోటుకు గురయ్యాడని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనను రక్షించుకోలేకపోయామని చెప్పారు.

"ఎంతో గొప్ప వైద్యం అందించారు. అమెరికా నుంచి కూడా డాక్టర్లు వచ్చారు. కానీ తారకరత్నను కాపాడుకోలేకపోయాం. ఎప్పుడు కనిపించినా నవ్వుతూ మామయ్య గారూ అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు. అలాంటి వ్యక్తి లేడంటే ఎంతో బాధగా  ఉంది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని తెలిపారు.

More Telugu News