Naresh: నటుడు నరేశ్ నివాసంపై దాడి... పోలీసులకు ఫిర్యాదు

Naresh complains to police after attack on his house
  • ఇంటి ముందు పార్క్ చేసిన కారు ధ్వంసం
  • రమ్య రఘుపతి హస్తం ఉందంటున్న నరేశ్
  • సీసీటీవీ ఫుటేజి పరిశీలిస్తున్న గచ్చిబౌలి పోలీసులు
హైదరాబాదులో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ నివాసంపై దాడి జరిగింది. ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై దుండగులు దాడికి పాల్పడ్డారని నరేశ్ ఆరోపించారు. గత రాత్రి కారును ధ్వంసం చేశారని తెలిపారు. తన భార్య రమ్య రఘుపతి ఈ దాడి వెనుక ఉన్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేశ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, సీసీటీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తున్నారు. 

కాగా, నరేశ్ ఇటీవల నటి పవిత్రా లోకేశ్ తో తన అనుబంధాన్ని బహిరంగంగా వెల్లడించడం తెలిసిందే. దాంతో ఆయన భార్య రమ్య రఘుపతి భగ్గుమంటున్నారు. నరేశ్, పవిత్ర లోకేశ్ మైసూరులో ఓ హోటల్ లో ఉండగా... రమ్య రఘుపతి చెప్పుతో కొట్టబోవడం సంచలనం సృష్టించింది.
Naresh
House
Attack
Police
Pavitra Lokesh
Ramya Raghupathi

More Telugu News