తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

  • మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
  • సోదరుడి పార్థివ దేహాన్ని చూసి భావోద్వేగం.. కుటుంబ సభ్యులకు పరామర్శ
  • వారిద్దరితో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
ntr and kalyan ram paid tribute to taraka ratna

సినీ నటుడు నందమూరి తారకరత్న భౌతికకాయానికి ఆయన సోదరులు కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ నివాళులర్పించారు. ఈరోజు హైదరాబాద్ మోకిలలోని తారకరత్న నివాసానికి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ చేరుకున్నారు. సోదరుడి పార్థివ దేహాన్ని చూసి వారు భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ తో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొద్దిసేపు మాట్లాడారు.

గుండెపోటుకు గురై కొన్ని రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. తారకరత్న భౌతికకాయానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఇంకెందరో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

More Telugu News