తారకరత్న కన్నుమూత... సంతాపం వ్యక్తం చేసిన సీఎం జగన్
- జనవరి 27న తారకరత్నకు గుండెపోటు
- లోకేశ్ పాదయాత్ర ప్రారంభంలో కుప్పకూలిన తారకరత్న
- 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం మృతి
తారకరత్న మృతి పట్ల ఏపీ సీఎం జగన్ స్పందించారు. సినీ నటుడు, ఎన్టీఆర్ మనవడు తారకరత్న కన్నుమూసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. విషాదంలో ఉన్న ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారని వెల్లడించింది.