Nirmala Sitharaman: రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలన్నీ చెల్లిస్తాం: నిర్మలా సీతారామన్

  • నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
  • పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • ఐదేళ్ల కాలవ్యవధిలోని బకాయిల చెల్లింపునకు మార్గం సుగమం
  • కేంద్రం నిధుల నుంచి చెల్లిస్తామని నిర్మల వెల్లడి
GST Council meet chaired by Nirmala Sitharamam

ఢిల్లీలో ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ చట్టం-2017కి లోబడి ఐదేళ్ల కాలవ్యవధికి సంబంధించిన అన్ని బకాయిలు చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. జీఎస్టీ పరిహారాలకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న అన్ని బకాయిలను రాష్ట్రాలకు చెల్లిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

జూన్ మాసానికి సంబంధించిన రూ.16,982 కోట్లను కూడా చెల్లించేందుకు కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఈ చెల్లింపులకు అవసరమైన నిధులు ప్రస్తుతం అందుబాటులో లేవని, కేంద్రం సొంత ఆర్థిక వనరుల నుంచి ఈ చెల్లింపులు చేస్తామని వివరించారు. ఇప్పుడు విడుదల చేసిన మొత్తాన్ని భవిష్యత్తులో పరిహార రుసుం వసూళ్ల నుంచి మినహాయించుకుంటామని నిర్మల చెప్పారు.

More Telugu News