దూకుడుగా ఆడుతున్న ఆసీస్... ఢిల్లీ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట
- ఆసక్తికరంగా ఢిల్లీ టెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేసిన ఆసీస్
- 262 పరుగులు చేసిన భారత్
- రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 61/1
ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 6 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో అవుట్ కాగా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హెడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 39 పరుగులు చేయగా, లబుషేన్ 19 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 62 పరుగులు కాగా... రేపటి ఆటలో ఆసీస్ ను టీమిండియా ఎంత త్వరగా ఆలౌట్ చేస్తే అంత మంచిది.
ఈ పిచ్ పై బ్యాటింగ్ నానాటికి కష్టసాధ్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, లక్ష్యఛేదన ఏమంత సులువు కాదు. ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేయగా, టీమిండియా 262 పరుగులు చేసింది.