Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పీఎస్ లో కేసు నమోదు

Police case files against Chandrababu in Bikkavolu
  • చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉద్రిక్తతలు
  • అనపర్తిలో పోలీసులపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
  • బిక్కవోలు పోలీసులకు ఫిర్యాదు చేసిన డీఎస్పీ భక్తవత్సలం
టీడీపీ అధినేత చంద్రబాబుపై తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించడంతో పాటు, దూషించారంటూ డీఎస్పీ భక్తవత్సలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఫిర్యాదు నేపథ్యంలో... చంద్రబాబు, మరో ఏడుగురు టీడీపీ నేతలపై కేసు నమోదైంది. చంద్రబాబు తదితరులపై 143, 353, 149, 188 సెక్షన్లు మోపినట్టు తెలుస్తోంది. 

చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు రోడ్ షోకి అనుమతి లేదంటూ పోలీసులు బలభద్రపురం వద్ద అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా పోలీసులు రోడ్డుపై బైఠాయించారు. 

దాంతో చంద్రబాబు వాహనం దిగి కాలినడకన 7 కిలోమీటర్లు ప్రయాణించి అనపర్తి చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు తన మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారంటూ చంద్రబాబు మండిపడ్డారు.
Chandrababu
Police Case
Bikkavolu
TDP
East Godavari District

More Telugu News