Vivo: వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వి27

Vivo launches new smart phone Vivo V27 features and price details
  • వివో సిరీస్ లో రెండు ఫోన్లను తీసుకొస్తున్న కంపెనీ
  • పూర్తి వివరాలను వెల్లడించని కంపెనీ
  • ఫీచర్లకు సంబంధించి కొన్ని అంశాలు మాత్రమే వెల్లడి 
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో.. భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ ను లాంఛ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వివో సిరీస్ లో భాగంగా రెండు కొత్త 5జి ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. వివో వీ27, వీ27ప్రొ మోడల్ ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలియజేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ కు సంబంధించి కేవలం కొన్ని వివరాలను మాత్రమే వెల్లడించింది. మిగతా విషయాలపై కంపెనీ సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తోంది. కొన్ని ఫీచర్లను మాత్రమే వెల్లడించింది.

ట్రిపుల్ కెమెరా సెటప్ తో వివో వీ27 స్మార్ట్‌ ఫోన్‌ ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక పంచ్ హోల్ డిజైన్‌తో ముందు భాగంలో క‌ర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించనున్నారు. కెమెరా విషయంలో కాంప్రమైజ్‌ లేకుండా హై క్వాలిటీతో తీసుకురానున్నట్లు టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కొత్త మోడల్ ధర విషయానికి వస్తే రూ.42 వేల దాకా ఉండొచ్చని నిపుణుల అంచనా. లాంచింగ్ ఆఫర్ కింద రూ.40 వేల లోపు ధరకే ఈ 5జి ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అనధికారిక సమాచారం.
Vivo
smart phone
v27
vivo 5g phone

More Telugu News